1 min read

AP TG Weather Updates: పగలు ఎండలు, సాయంత్రం వర్షాలు, నాలుగు రోజుల్లో నైరుతి రుతుపవనాలు, రైతులకు ఐఎండి తీపికబురు

AP TG Weather Updates: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో  విచిత్ర వాతావరణం కనిపిస్తోంది. పగలు అధిక ఉష్ణోగ్రతలు, సాయంత్రానికి  కారుమబ్బులతో వర్షాలు కురుస్తున్నాయి. ఈ ఏడాది మే మొదటి వారం నుంచి మండే ఎండల నుంచి అల్పపీడన ప్రభావంతో ప్రజలకు ఉపశమనం లభించింది.