1 min read

Janasena On CS Jawahar Reddy : ఉత్తరాంధ్ర అసైన్డ్ భూముల కుంభకోణంలో సీఎస్ జవహర్ రెడ్డి హస్తం – జనసేన నేత మూర్తి యాదవ్

Janasena On CS Jawahar Reddy : సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తరాంధ్రలో 800 ఎకరాల అసైన్డ్ భూములను దోచేశారని జనసేన నేత పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. రిజిస్ట్రేషన్లు పూర్తి అయ్యేలా అధికారులపై సీఎస్ ఒత్తిడి చేస్తున్నారన్నారు. మార్చి నుంచి జరిగిన అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.